చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’
ABN , First Publish Date - 2021-10-21T09:33:24+05:30 IST
‘‘చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా, వారి కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ పథకం తీసుకొచ్చాం.

- 9,05,458 మందికి 905 కోట్ల వడ్డీ లేని రుణం చెల్లింపు
- సకాలంలో కట్టిన 4,50,546 మందికి 16.36 కోట్ల వడ్డీ జమ
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా, వారి కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ పథకం తీసుకొచ్చాం. గతంలో ఏ ప్రభుత్వమూ వీరిని పట్టించుకోలేదు. అందుకే అధికారంలోకి రాగానే బ్యాంకర్లందరితో మాట్లాడా. రూ.10 వేలు రుణంగా ఇవ్వగలిగే మంచి జరుగుతుందని వారిని ఒప్పించి, గత ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభించాం. అందులో భాగంగా 2020 నవంబరులో రుణాలు తీసుకొని 30 సెప్టెంబరు 2021 నాటికి వాటిని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని నేడు జమ చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ‘జగనన్న తోడు’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.