జగనన్న విద్యా దీవెనకు రూ.5572 కోట్లు

ABN , First Publish Date - 2021-11-23T09:49:54+05:30 IST

వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకానికి ఇప్పటి వరకూ రూ.5572 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు.

జగనన్న విద్యా దీవెనకు రూ.5572 కోట్లు

వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకానికి ఇప్పటి వరకూ రూ.5572 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు జోగి రమేశ్‌, కాకాని గోవర్దన్‌, మేరుగ నాగార్జున అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గత ప్రభుత్వం చివరి రెండేళ్లల్లో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత బకాయిలు రూ.1777 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రంలో బీసీ ఉప ప్రణాళిక నిధులు మళ్లించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-11-23T09:49:54+05:30 IST