‘అంతా నాకే’ అంటున్న జగన్‌: దినకర్‌

ABN , First Publish Date - 2021-12-26T08:28:39+05:30 IST

‘అంతా నాకే’ అంటున్న జగన్‌: దినకర్‌

‘అంతా నాకే’ అంటున్న జగన్‌: దినకర్‌

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘అంత్యోదయ’కు ప్రాధాన్యమిస్తూ దేశ గ్రామీణ వికాసానికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ‘అంతా నాకే’ అంటూ రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు’’ అని బీజేపీ నేత లంకా దినకర్‌ ఆరోపించారు. అటల్‌ బిహారీ వాజపేయి స్ఫూర్తితో దేశమంతా సుపరిపాలన దినోత్సవం జరుపుకొంటుంటే ఏపీలో ఏక వ్యక్తి నిరంకుశత్వంతో స్వపరిపాలన సాగిస్తున్నారని ధ్వజమత్తారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ మోదీ పాలనలో కనిపిస్తుంటే... అంతా నాకే, అందరిదీ నాదే, అంతా నా వికాసమే అనేలా జగన్‌ పాలన ఉందని దినకర్‌ విమర్శించారు. 

Updated Date - 2021-12-26T08:28:39+05:30 IST