జగన్‌, సాయిరెడ్డి అవినీతికి ప్రతిరూపాలు

ABN , First Publish Date - 2021-02-08T09:57:26+05:30 IST

సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిలు అవినీతికి ప్రతిరూపాలని, వారు అవినీతి గురించి మాట్లాడుతుంటే.. ఆ అవినీతే సిగ్గుతో తలదించుకుంటోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

జగన్‌, సాయిరెడ్డి అవినీతికి ప్రతిరూపాలు

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌

అమరావతి 7(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిలు అవినీతికి ప్రతిరూపాలని, వారు అవినీతి గురించి మాట్లాడుతుంటే.. ఆ అవినీతే సిగ్గుతో తలదించుకుంటోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు. ‘‘20 నెలల పాలనలో.. గత టీడీపీ పాలనపై 20 పైసల అవినీతిని చూపించలేక చేతులెత్తేశారు. ఇంకా ఎంతకాలం చంద్రబాబు పాలనలో అవినీతి అంటూ కాలం గడిపేస్తావ్‌ సాయిరెడ్డీ? పంచాయతీ ఎన్నికల్లో నిలబడటానికి వైసీపీ మద్దతుదారులు పారిపోతున్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించినా.. అభ్యర్థులు దొరక్క, టీడీపీ నాయకులను పార్టీలో చేరమని కాళ్లా.. వేళ్లా పడుతున్నారు కదా సాయిరెడ్డీ!’’ అని ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-02-08T09:57:26+05:30 IST