బ్రహ్మదేవుడు కూడా జగన్‌ను జైలుకు పంపలేడు: నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-12-31T01:25:27+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డిని బీజేపీ నేతలు కాదు కదా వాళ్లని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపలేడు. బీజేపీ నేత సోమువీర్రాజు

బ్రహ్మదేవుడు కూడా జగన్‌ను జైలుకు పంపలేడు: నారాయణస్వామి

తిరుమల: ‘సీఎం జగన్మోహన్‌రెడ్డిని బీజేపీ నేతలు కాదు కదా వాళ్లని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపలేడు. బీజేపీ నేత సోమువీర్రాజు వంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ప్రధాని మోదీ గుర్తించాలి. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా, చీప్‌ లిక్కర్‌ ఇచ్చి ప్రజలను సంతోష పెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు’ అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విరుచుకుపడ్డారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖలపై నారాయణస్వామి స్పందిస్తూ.. జగన్‌ ఓ సింహమని, ఎంతమంది వచ్చినా ఒంటరిగా పోరాడుతున్నారని కొనియాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉంటే కోటేశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు ఆయన బాటలో నడుస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కు భగవంతుడి ఆశీస్సులుంటాయని నారాయణస్వామి చెప్పారు.

Updated Date - 2021-12-31T01:25:27+05:30 IST