సీజేఐ దంపతులను కలిసిన జగన్‌ దంపతులు

ABN , First Publish Date - 2021-12-25T21:32:25+05:30 IST

జేఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్‌ దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణను జగన్ కలిశారు.

సీజేఐ దంపతులను కలిసిన జగన్‌ దంపతులు

అమరావతి: సీజేఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్‌ దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణను జగన్ కలిశారు. జస్టిస్‌ ఎన్వీ రమణకు జగన్‌ ఇవాళ తేనేటి విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అంతకుముందు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు రోడ్డు మార్గంలో చేరకున్న సీజేఐ ఎన్వీరమణ దంపతులు పొన్నూరులోని వీరాంజనేయ స్వామి ఆలయం, సహాస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. రెండు ఆలయాల్లో వారు ప్రత్యేక పూజాలు నిర్వహించారు.

Updated Date - 2021-12-25T21:32:25+05:30 IST