ఆ ఘటన నా మనసును చాలా కలచివేసింది: జగన్

ABN , First Publish Date - 2021-06-22T18:12:03+05:30 IST

ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని... ఈ ఘటన కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో..

ఆ ఘటన నా మనసును చాలా కలచివేసింది: జగన్

అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని... ఈ ఘటన కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఏపీలో రెండో విడత వైఎస్సార్‌ చేయూత పంపిణీని జగన్‌ ప్రారంభించారు. 23.14 లక్షల మంది మహిళల ఖాతాల్లో 4339.39 కోట్లు జమ అయ్యాయి. వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు ఏటా రూ.18,500 పంపిణీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగిందన్నారు. ఇది తన మనసును చాలా కలిచి వేసిందని జగన్ పేర్కొన్నారు. దీనికి చాలా చింతిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదన్నారు. మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని తానన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని జగన్ వెల్లడించారు. 
Updated Date - 2021-06-22T18:12:03+05:30 IST