జగన్.. దమ్ముంటే రా
ABN , First Publish Date - 2021-10-21T09:59:25+05:30 IST
‘‘జగన్‌రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అని టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనతో తేలిపోయింది. ఇంట్లో దాక్కుని పెంపుడు కుక్కల్ని పం పడం కాదు

- నేరుగా వస్తే మాట్లాడుదాం, పోరాడుదాం
- డీజీపీ ఆఫీసు ముందే వాహనాలు వచ్చాయి
- డీఎస్పీనే దుండగులను వాహనాలు ఎక్కించారు
- గతంలో చంద్రబాబును ఎన్నో మాటలన్నారు
- 2024లో వచ్చేది మేమే.. ఎవరినీ వదలం
- రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించాలి: లోకేశ్
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అని టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనతో తేలిపోయింది. ఇంట్లో దాక్కుని పెంపుడు కుక్కల్ని పం పడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే రా.. మాట్లాడుదాం, పోరాడుదాం. ఎవరూ లేని సమయంలో వచ్చి దాడి చేసి పిల్లుల్లా వెళ్లిపోవడం కాదు.. వైసీపీ నేతలకు నిజంగా పోరాడాలని ఉంటే.. సమయం, స్థలం చెప్పా లి. నేనే వస్తా. ఈ రోజు గ్లాసులు పగలగొట్టారు. భవిష్యత్తులో వాళ్ల వీపులు పగులుతాయి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ చేశా రు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దాడి జరిగింది కార్యాలయం మీద కాదని, 70 లక్షల మంది కార్యకర్తల దేవాలయం మీదని అన్నారు. దాడి చేసిన సైకోరెడ్డి ఫ్యాన్స్ దేశంలో ఎక్కడ దాక్కు న్నా టీడీపీ వదలదని హెచ్చరించారు.
‘‘ఈ రోజు దేశం లో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా కేరాఫ్ అడ్రస్ ఏపీనే అని తేలుతుంది. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వ్యాపారంలా మారిపోయిం ది. ఉద్యోగాలివ్వలేక గంజాయిని వ్యాపారంలా మార్చేశారు. తుని, అరకు, నర్సీపట్నం, తదితర ప్రాంతాల నుంచి తెలంగాణకు గంజాయి వస్తోందని హైదరాబా ద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఆయనకు తెలిసిన మాత్రం రాష్ట్ర డీజీపీకి తెలియడం లేదా? సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్సీలు ఇదే వ్యాపారం చేస్తున్నారు. వాళ్ల పిల్లలకు డ్రగ్స్ పరీక్ష చేయించాలి. మేమూ చేయించుకుంటామని మా వాళ్లు సవాల్ చేస్తే ముందుకురాలే దు. ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గంజాయిపై ఉద్యమం చేయాలని, పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని అన్నారు. కానీ ఇక్కడ సైకో జగన్‌కు చీమకుట్టినట్లు కూడా లేదు’’ అని లోకేశ్ విమర్శించారు.
వైసీపీ, ప్రభుత్వం కలిసి దాడి
‘‘టీడీపీ కార్యాలయంపై వైసీపీ కుక్కలు, ప్రభుత్వం కలిసి దాడి చేశాయి. వైసీ పీ నేతల వాహనాలన్నీ డీజీపీ కార్యాలయం ముం దు నుంచే వచ్చాయి. దాడి తర్వాత డీజీపీ కార్యాలయం ముందు నుంచే వైసీపీ కార్యాలయానికి వెళ్లా యి. ఇంకా చిత్రం ఏంటంటే ఆ సమయంలో టీడీపీ కార్యాలయం దగ్గర ఉ న్న డీఎస్పీ.. దాడిచేసిన వాళ్లను త్వర గా వాహనాలు ఎక్కండి అంటూ ఎక్కించారు. అడ్డుకుని, అరెస్టు చేయాల్సిందిపోయి వాహనాలు ఎక్కించి పంపారు. వీడియో సాక్ష్యాలు ఉన్నా యి. టీడీపీ ఆఫీస్‌కి నేను వచ్చాక మా ఎమ్మెల్సీ అశోక్‌బాబు నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ కుర్చీలో ఒకాయన కూర్చుని ఉన్నారు. ఎవరని అడిగితే మాట్లాడలేదు. విచారిస్తే డీజీపీ కార్యాలయంలో పీఆర్వో అని తేలింది. అతన్ని అక్కడి నుంచి పంపించేశాం. కానీ అతనిపై హత్యాయత్నం చేశామని కేసు పెట్టారు. నే ను, అశోక్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ హత్యాయత్నం చేశామని కేసు నమో దు చేశారు. 6.30 గంటలకు నేను కార్యాలయానికి వచ్చానని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నేను కార్యాలయానికి వచ్చిందే 8.30 గంటలకు. ఇదీ ఆంధ్రా పోలీసుల తీరు. అదే మా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని కొట్టి తలపై బలమైన గాయం చేశారు. కానీ దాడిచేసిన వారిపై మాత్రం హత్యాయత్నం కేసు పెట్టలేదు. గతంలో జగన్‌రెడ్డి ఎన్ని తిట్టినా నాడు పాదయాత్రకు పోలీసు రక్షణ పెంచి, రోప్ పార్టీలు ఇచ్చాం. చంద్రబాబు సహనశీలి’’ అన్నారు.
వైసీపీ నేతలు ఎన్ని బూతులు మాట్లాడారో..
‘‘సైకోరెడ్డి భలే అబద్దాలు చెబుతున్నారు. అతనికి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను, వైసీపీ నేతలు ఎప్పుడూ బూతులు, పరుషంగా మాట్లాడడం చేయలేదన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అన్న అనాలా? దున్న అనాలా?.. ముఖ్యమంత్రి అనాలా? ముఖ్యకంత్రీ అనాలా?.. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు, కాల్చేయాలి.. లాంటి పదాలు వాడింది ఎవరు’’ అని లోకేశ్ అన్నారు.
