జగన్ ప్రభుత్వానికి వచ్చే నెల కూడా గండమేనా!

ABN , First Publish Date - 2021-07-25T03:26:16+05:30 IST

జగన్ ప్రభుత్వానికి వచ్చే నెల కూడా గండమేనా!

జగన్ ప్రభుత్వానికి వచ్చే నెల కూడా గండమేనా!

అమరావతి: జగన్ ప్రభుత్వానికి ప్రతి నెలా అప్పుల గండం వెంటాడుతోంది. అప్పు తెచ్చేదారులు మూసుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుడు రేపు అంటూ దుకాణాల ముందు పెట్టే బోర్డు ఇప్పుడు బ్యాకులకు కూడా పెట్టనున్నాయి. ఆస్తులను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లిన వెంటనే చిటికెలో పని చేసుకువచ్చే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్న కేంద్రమంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు మాట దాటేస్తున్నారు. ఆగస్టు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. Updated Date - 2021-07-25T03:26:16+05:30 IST