ఏపీ నిట్‌ విద్యార్థినికి జాక్‌పాట్‌

ABN , First Publish Date - 2021-12-31T07:24:10+05:30 IST

ఏపీ నిట్‌ విద్యార్థినికి జాక్‌పాట్‌

ఏపీ నిట్‌ విద్యార్థినికి జాక్‌పాట్‌

ఖమ్మం వాసికి 32 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌ ఆఫర్‌


తాడేపల్లిగూడెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ నిట్‌ విద్యార్థిని, తెలుగు తేజం జి ఆశ్రిత రెడ్డి జాక్‌పాట్‌ కొట్టేసింది. ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతుండగానే అమెజాన్‌లో రూ.32 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికైంది. ఆమె స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం. తండ్రి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆశ్రిత రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌ సెలక్షన్‌లో ఆమెకు అమెజాన్‌ కంపెనీ భారీ ప్యాకేజీ ఆఫర్‌ చేసింది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌లోనే ఉన్నత చదువులకు వెళ్లాలన్నదే తన లక్ష్యమని వివరించిన ఆశ్రిత.. ఇంటర్వ్యూలో కోర్‌ సబ్జెక్ట్‌పైనే అధికంగా ప్రశ్నలు అడిగారని చెప్పింది.

Updated Date - 2021-12-31T07:24:10+05:30 IST