మహిళల రక్షణపై జగన్‌రెడ్డికి బాధ్యత లేదా?: పోతిన

ABN , First Publish Date - 2021-06-22T00:56:00+05:30 IST

మహిళల రక్షణపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బాధ్యత లేదా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.

మహిళల రక్షణపై జగన్‌రెడ్డికి బాధ్యత లేదా?: పోతిన

విజయవాడ: మహిళల రక్షణపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బాధ్యత లేదా అని  జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలో యువతిపై అత్యాచారం జరిగినా స్పందించలేదన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ తక్షణం బాధితులను పరామర్శించి, అండగా ఉండాలని డిమాండ్ చేశారు. మహిళలను కాపాడలేని దిశా చట్టం...  ప్రచారం కోసం చేసిందేనని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతున్న బెస్ట్ పోలీసింగ్ అవార్డులు షో కేసులో పెట్టుకోవడానికే వస్తాయని ఎద్దేవా చేశారు. కడప చిత్తూరు జిల్లాల్లో యువతుల గొంతు కోసి, కాల్పులు జరిపినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లపై పోలీసులకు ఎందుకంతా సాఫ్ట్ కార్నర్? అని పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-22T00:56:00+05:30 IST