నకిలీ చలాన్ల వ్యవహారంలో కొనసాగుతున్న దర్యాప్తు

ABN , First Publish Date - 2021-08-13T20:06:05+05:30 IST

నకిలీ చలాన్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో

నకిలీ చలాన్ల వ్యవహారంలో కొనసాగుతున్న దర్యాప్తు

అమరావతి: నకిలీ చలాన్ల వ్యవహారంలో దర్యాప్తు  కొనసాగుతోంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందం తనిఖీలు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో కూడా తనిఖీలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్‌ వేటు వేశారు. మరికొందరి పాత్రపై అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల సస్పెన్షన్ వేటు వేశారు. బోగస్ చలానాలతో రిజిస్ట్రార్లు, సిబ్బంది రూ.1.08 కోట్లు స్వాహా చేశారు. కర్నూలు జిల్లాలో అధికారుల విచారణలో వాస్తవాలు తేలడంతో ఐదుగురిపై వేటు వేశారు.


నకిలీ చలానాల వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశామని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగాయన్నారు. రూ. 7 లక్షల 95 వేల విలువైన నకిలీ చలనాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. సాఫ్ట్ వేర్‌లో ఉన్న లొసుగుల ఆధారంగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుందని వెల్లడించారు. 

Updated Date - 2021-08-13T20:06:05+05:30 IST