విజయవాడ నుంచి అంతర్జాతీయ ఫ్లైట్లు

ABN , First Publish Date - 2021-05-30T09:16:21+05:30 IST

బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌, కువైట్‌, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి

విజయవాడ నుంచి అంతర్జాతీయ ఫ్లైట్లు

విజయవాడ, మే 29(ఆంధ్రజ్యోతి): బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌, కువైట్‌, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. జూన్‌ 1, 2 తేదీలలో ఈ సర్వీసులు ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ విమాన సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపి స్లాట్‌ కోరాయి. షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజులలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులుగా విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు. ఈ నెలాఖరుకు విస్తరణ పనులు పూర్తి కాబోతున్నాయి. ఈ దశలో విజయవాడ నుంచి ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటం విశేషం. గతంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) విధానంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడిపింది. అప్పుడు ఆ సర్వీసుకు 98 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం వీజీఎ్‌ఫను ఉపసంహరించుకోవటంతో ఏడాదిన్నరగా సింగపూర్‌కు విమాన సర్వీసు లేకుండా పోయింది. తాజా పరిణామాలతో తిరిగి గన్నవరం విమానాశ్రయం కళకళలాడే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2021-05-30T09:16:21+05:30 IST