నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
ABN , First Publish Date - 2021-07-23T08:51:23+05:30 IST
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాయంత్రం 4 గంటలకు విడుదల
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆ వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్నెట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం వెల్లడించారు. ఈ కింది వెబ్‌సైట్లలో ఫలితాలను అందుబాటులో ఉంచుతారు. http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in,