ఆలయాల వద్ద పటిష్ఠ నిఘా

ABN , First Publish Date - 2021-11-02T08:38:24+05:30 IST

దేవాలయాల్లో నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా 51 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు.

ఆలయాల వద్ద పటిష్ఠ నిఘా

రాష్ట్రవ్యాప్తంగా 51వేల సీసీ కెమెరాల ఏర్పాటు


గుడివాడ (రాజేంద్రనగర్‌), నవంబరు 1: దేవాలయాల్లో నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా 51 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం రాత్రి కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌, గుడివాడ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌  కౌశల్‌తో కలిసి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయి, నాటుసారా అమ్మే వ్యక్తులలో స్పందన పరివర్తన ద్వారా మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-11-02T08:38:24+05:30 IST