తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి దాడి

ABN , First Publish Date - 2021-03-21T09:39:20+05:30 IST

తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం ముందు సర్కిల్‌లోని రాతి విగ్రహాన్ని మతిస్థిమితం లేని వ్య క్తి ధ్వంసం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చికిత్స కోసం

తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి దాడి

రాతి విగ్రహం ధ్వంసం


తిరుమల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం ముందు సర్కిల్‌లోని రాతి విగ్రహాన్ని మతిస్థిమితం లేని వ్య క్తి ధ్వంసం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మత్తు బానిసల పునరావాస కేంద్రానికి తరలించారు. టీటీడీ కథనం మేరకు.. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రామకృష్ణ మానసిక సమతుల్యం కోల్పోయి శుక్రవారం రాత్రి వింతగా ప్రవర్తించాడు.


భక్తుల వాహనాలను ఆపుతూ కేకలు పెట్టడంతో పాటు సర్కిల్‌లోని పూలకుండీలపై, అలంకృత రాతి రథంలోని విగ్రహంపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. టీటీడీ అధికారులు వెంటనే నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  తన భర్తకు ఆల్కహాల్‌ డిపెండెంట్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి ఉందని రామకృష్ణ భార్య పద్మ చెప్పింది.

Updated Date - 2021-03-21T09:39:20+05:30 IST