ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-25T22:20:30+05:30 IST

రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో బుధవారం వాదనలు ముగిసాయి. రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పకుండా ఒక్క ప్రెస్ నోట్‌తో ఇంటర్

ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో బుధవారం వాదనలు ముగిసాయి. రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పకుండా ఒక్క ప్రెస్ నోట్‌తో ఇంటర్ బోర్డు ఆన్‌లైన్ అడ్మిషన్ల మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేకుండానే బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఇంటర్ కళాశాలల్లో ఆగష్టు 16 నుంచి క్లాసులు ప్రారంభించారు. ఇప్పుడు అడ్మిషన్లను ఆన్‌లైన్ చేయడంపై కళాశాలల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ అభ్యంతరం వ్యక్తం చేసారు.


కోవిడ్ నేపథ్యలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఆన్‌లైన్ అడ్మిషన్లను నిర్వహించాలని నిర్ణయించామని బోర్డు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని కోవిడ్ నిబంధనల కారణంగా ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు. 


Updated Date - 2021-08-25T22:20:30+05:30 IST