విశాఖ ఉక్కు కోసం వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-03-21T17:33:42+05:30 IST
విశాఖ ఉక్కు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తున్నారు. ఉద్యోగులు పలు పద్ధతుల్లో నిరసనలు చేపడుతున్నారు.

విశాఖ: విశాఖ ఉక్కు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తున్నారు. ఉద్యోగులు పలు పద్ధతుల్లో నిరసనలు చేపడుతున్నారు. ఆదివారం ఆర్కే బీచ్‌లో ఉక్కు ఉద్యోగుల కుటుంబ సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫ్లకార్డ్స్, బ్యానర్లు ప్రదర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరించవద్దని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలకు ఉక్కు కార్మికుల కుటుంబ సభ్యులు విన్నవించారు.