మంత్రి శంకర్ నారాయణను అడ్డుకున్న కార్యకర్తలు
ABN , First Publish Date - 2021-03-24T20:06:33+05:30 IST
అనంతపురం జిల్లా: మంత్రి శంకర్ నారాయణను వైసీపీ కార్యకర్తలు నిలదీశారు.

అనంతపురం జిల్లా: మంత్రి శంకర్ నారాయణను వైసీపీ కార్యకర్తలు నిలదీశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరిగింది. పనిలో పనిగా కదిరి ప్రభుత్వాసుపత్రికి భూమిపూజ కూడా నిర్వహించారు. మంత్రి శంకర్ నారాయణతోపాటు హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా తలుపుల మండలం నాయుడు, పూల శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే నాయకులకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో అలజడి ఏర్పడింది. దీంతో శ్రీనివాసరెడ్డికి ఎంపీ గోరంట్ల మాధవ్, ఇతరులు సర్ది చెప్పారు.