ఎన్నికల చిత్రాలో..!
ABN , First Publish Date - 2021-02-01T09:19:52+05:30 IST
అది గ్రామ పంచాయతీనే. ఆ పంచాయతీకి సర్పంచ్‌లుగా చాలామంది పని చేశారు. కానీ ఎప్పుడూ ఎన్నికలే జరగలేదు.

ఎన్నికలే ఎరుంగని వెదురుకుప్పంలో..!
అది గ్రామ పంచాయతీనే. ఆ పంచాయతీకి సర్పంచ్‌లుగా చాలామంది పని చేశారు. కానీ ఎప్పుడూ ఎన్నికలే జరగలేదు. వెదురుకుప్పం బాట ఎప్పుడూ ఏకగ్రీవమే. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఈ పంచాయతీ మండల కేంద్రం కూడా. ఈ పంచాయతీలో 1776 మంది ఓటర్లు ఉన్నారు. 1961లో తొలి సర్పంచ్‌గా బండి పెద్దచెంగారెడ్డి ఎన్నికయ్యారు. ఆతర్వాత ఆరుసార్లు అంటే 1996 వరకు పేట శివశంకర్‌రెడ్డి అలియాస్ అబ్బన్న సర్పంచ్‌గా ఉన్నారు.ఆతర్వాత పేట నీరజ, బత్తల చిరంజీవిరెడ్డి, ఎం.చిన్నబ్బ, బండి నవనీతమ్మ సర్పంచ్‌లుగా పనిచేశారు. అలాంటి వెదురుకుప్పంలో ఈసారి ఎన్నికల కోలాహలం నెలకొంది. సర్పంచ్ పదవికి 13, పది వార్డులకు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మరి ఆనవాయితీకి భిన్నంగా ఎన్నికలు జరుగుతాయో? లేక ఏకగ్రీవం అవుతుందో చూడాలి.
- వెదురుకుప్పం