కాకినాడలో ప్రకటించిన కార్యవర్గం బోగస్‌

ABN , First Publish Date - 2021-08-27T08:58:23+05:30 IST

దివంగత నేత పిళ్లా వెంకటేశ్వరరావు 2004లో స్థాపించిన రాష్ట్ర కాపునాడును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇటీవల కాకినాడలో కొందరు ప్రకటించుకున్న కాపునాడు ..

కాకినాడలో  ప్రకటించిన కార్యవర్గం బోగస్‌

కాపునాడు నేతల ప్రకటన

విజయవాడ(గవర్నర్‌పేట), ఆగస్టు 26: దివంగత నేత పిళ్లా వెంకటేశ్వరరావు 2004లో స్థాపించిన రాష్ట్ర కాపునాడును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇటీవల కాకినాడలో కొందరు ప్రకటించుకున్న కాపునాడు కొత్త కార్యవర్గం బోగస్‌ అని కాపునాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పిళ్లా శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసేందుకు పిళ్లా వెంకటేశ్వరరావు సంతాపసభ ముసుగులో కొందరు కాకినాడలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాని కాపునాడును కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం రాజకీయ రంగు పులిమేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. పిళ్లా స్థాపించిన కాపునాడు కార్యవర్గ సమావేశాన్ని త్వరలో విజయవాడలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2021-08-27T08:58:23+05:30 IST