కర్నూలు జిల్లాలో 30 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-19T08:17:41+05:30 IST

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

కర్నూలు జిల్లాలో 30 మందికి అస్వస్థత

  • కలుషిత నీరే కారణమంటున్న ముత్తుకూరు గ్రామస్థులు


ఆదోని(ఆస్పరి), అక్టోబరు 18: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తొమ్మిది మంది ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు వెళ్లారు. మంచినీటి పైపులైను మురుగు నీటి కాలువలో లీక్‌ కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్థులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2021-10-19T08:17:41+05:30 IST