నెల్లూరు జిల్లాలో జోరుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు

ABN , First Publish Date - 2021-12-26T16:41:20+05:30 IST

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో జోరుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం తిరమనతిప్పపై జోరుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలతో స్థానికులు తిప్పలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం తో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గుత్తేదారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. మూడు జేసీబీ మిషన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో జోరుగా అక్రమంగా గ్రావెల్‌ని తరలిస్తున్నారు.అక్రమ గ్రావెల్‌తో ఇసుకను తరలించేందుకు గుత్తేదారులు బాటలు వేసుకుంటున్నారు.

Updated Date - 2021-12-26T16:41:20+05:30 IST