ఈ క్లాత్‌ ఉంటే ఏసీలో ఉన్నట్టే!

ABN , First Publish Date - 2021-06-21T09:36:48+05:30 IST

గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే ఏసీ ఉండాల్సిందే! కానీ.. ఏసీకి బదులుగా శాస్ర్తీయంగా తయారు చేసిన క్లాత్‌తో గది ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చని ఏపీ రాష్ట్రం అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థి ని శ్రీలేఖ వివరిస్తోంది.

ఈ క్లాత్‌ ఉంటే ఏసీలో ఉన్నట్టే!

  • గది ఉష్ణోగ్రతను తగ్గించే వస్త్రం
  • ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థిని శ్రీలేఖ ఘనత

మంగళగిరి, జూన్‌ 20: గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే ఏసీ ఉండాల్సిందే! కానీ.. ఏసీకి బదులుగా శాస్ర్తీయంగా తయారు చేసిన క్లాత్‌తో గది ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చని ఏపీ రాష్ట్రం అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థి ని శ్రీలేఖ వివరిస్తోంది. భౌతికశాస్త్రం ప్రధాన సబ్జెక్టు గా బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న శ్రీలేఖ సహారా ఏడారిలో కనిపించే చీమల శరీరతత్వాన్ని అధ్యయ నం చేసి అందుకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్‌ క్లాత్‌తో గది ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చునని గుర్తించింది. సహారా ఎడారిలో వెలుపలి ఉష్ణోగ్రతల కన్నా చీమల శరీర ఉష్ణోగ్రత 5 నుంచి 10 డిగ్రీల వరకు తక్కువగా ఉంటుంది. చీమలకు ఉండే వెంట్రుకలు సూర్యకిరణాలను నేరుగా శరీరంలోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని అవి పరావర్తనం చెందేలా చేస్తాయి. ఇదే తరహా గుణమున్న సైంటిఫిక్‌ క్లాత్‌ను తయారు చేస్తే నివాస గృహాల గది ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చని శ్రీలేఖ గుర్తించింది. తన పరిశోధన వివరాలను తెలియజేస్తూ భారత పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపింది.  

Updated Date - 2021-06-21T09:36:48+05:30 IST