శ్రీగంధం దుంగల పట్టివేత

ABN , First Publish Date - 2021-10-30T02:38:22+05:30 IST

జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు

శ్రీగంధం దుంగల పట్టివేత

నెల్లూరు: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో వెంకటగిరి-ఏర్పేడు దగ్గర వాహన తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా రవాణా చేస్తున్న శ్రీగంధం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీగంధం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓజిలి మండలంలోని ఆర్మెన్‌పాడు వైసీపీ ఎంపీటీసీ రఘురామరాజును, మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-30T02:38:22+05:30 IST