రోడ్డు వేయకుంటే ఒడిసాలో కలిసిపోతాం

ABN , First Publish Date - 2021-01-13T09:22:41+05:30 IST

తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిసా రాష్ట్రంలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు తెగేసి చెప్పారు.

రోడ్డు వేయకుంటే ఒడిసాలో కలిసిపోతాం

ఎమ్మెల్యేకు తెగేసి చెప్పిన ‘కొదమ’ గిరిజనులు


సాలూరు రూరల్‌, జనవరి 12: తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిసా రాష్ట్రంలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు తెగేసి చెప్పారు. 70 రోజుల్లో రోడ్డు వేస్తామని సెప్టెంబరు 9న హామీ ఇచ్చారని, మూడు నెలలు దాటినా పనులు ప్రారంభం కాలేదని నిలదీశారు. ఒడిసా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని, రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిసాలో కలిసిపోతామని చెప్పారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని,  త్వరలోనే  అనుమతి సాధిస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. 

Updated Date - 2021-01-13T09:22:41+05:30 IST