పెన్షన్ పెంపు ఈ ఏడాదీ లేనట్లేనా?
ABN , First Publish Date - 2021-05-21T09:34:01+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచి ఇస్తామన్న సామాజిక పెన్షన్‌కు ఈ ఏడాది కూడా మోక్షం లేనట్లేనని బడ్జెట్ అంచనాలను బట్టి తెలుస్తోంది

బడ్జెట్‌లో లేని ప్రస్తావన
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచి ఇస్తామన్న సామాజిక పెన్షన్‌కు ఈ ఏడాది కూడా మోక్షం లేనట్లేనని బడ్జెట్ అంచనాలను బట్టి తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.250 పెంచి, ఇకపై ఏటా రూ.250 వంతున పెంచుతామని చెప్పింది. రెండేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్‌లోనైనా పెన్షన్ పెంపుదలను ప్రకటిస్తారని పెన్షన్‌దారులు ఆశగా ఎదురుచూశారు. వారి ఆశలు నిరాశలయ్యాయి. ప్రభుత్వంలో కూడా పెన్షన్ల మొత్తం పెంపుదలపై చర్చ జరిగినట్లు లేదు. దీంతో ఈ ఏడాది కూడా అవ్వా తాతలకు పెన్షన్ల పెంపుదల లేనట్లేనని తెలుస్తోంది.