ఎన్‌టీటీపీఎస్ చెరువుపై ఏపీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను

ABN , First Publish Date - 2021-03-22T03:08:52+05:30 IST

ఎన్‌టీటీపీఎస్ చెరువుపై ఏపీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను

ఎన్‌టీటీపీఎస్ చెరువుపై ఏపీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను

కృష్ణా: ఇబ్రహీంపట్నం ఎన్‌టీటీపీఎస్ బూడిద చెరువు వేదికగా వైసీపీ నాయకుల బాహాబాహికి దిగారు. మైనింగ్ మంత్రి బాలినేని అనుచరులు.. వసంత కృష్ణ ప్రసాద్ బామ్మర్ది వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఎన్‌టీటీపీఎస్ బూడిద చెరువు కాసుల వర్షం కురిపిస్తోంది. దీన్ని దక్కించుకునేందుకు ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-22T03:08:52+05:30 IST