ఐఏఎస్‌ల సంఘం స్పందించాలి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు
ABN , First Publish Date - 2021-09-03T21:48:40+05:30 IST
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఐఏఎస్‌ల సంఘం స్పందించాలని...

విజయవాడ: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఐఏఎస్‌ల సంఘం స్పందించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై అధికారుల వేధింపులను ఆపాలని తెలిపారు. ఉద్యోగ సంఘాలు దీనిపై మాట్లాడాలన్నారు. ఐఏఎస్‌లు ప్రభుత్వం తీసుకునే చట్ట విరుద్ధ నిర్ణయాలను వ్యతిరేకించాలని ఆయన పేర్కొన్నారు.