కాలువల నుంచి జలవిద్యుదుత్పత్తి!

ABN , First Publish Date - 2021-05-08T08:42:07+05:30 IST

సాగునీటి కాలువ నుంచి జల విద్యుదుత్పత్తిపై జల వనరుల శాఖ దృష్టి సారించింది. ప్రధానంగా హంద్రీ-నీవా సుజల స్రవంతి, పోలవరం ప్రధాన కాలువ నుంచి కరెంటు ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తోంది

కాలువల నుంచి జలవిద్యుదుత్పత్తి!

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువ నుంచి జల విద్యుదుత్పత్తిపై జల వనరుల శాఖ దృష్టి సారించింది. ప్రధానంగా హంద్రీ-నీవా సుజల స్రవంతి, పోలవరం ప్రధాన కాలువ నుంచి కరెంటు ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ కాలువల నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని బెంగళూరుకు చెందిన ఇన్నొవేటివ్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఈఎన్‌సీ నారాయణరెడ్ఢి అధ్యక్షతన  అధ్యయన కమిటీని నియమిస్తూ శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - 2021-05-08T08:42:07+05:30 IST