కరోనాతో భర్త.. బాధతో భార్య మృతి

ABN , First Publish Date - 2021-06-22T08:44:29+05:30 IST

కరోనాతో భర్త మృతి చెందగా.. ఆయన మరణ వార్తను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో చోటు చేసుకుంది

కరోనాతో భర్త.. బాధతో భార్య మృతి

సత్యవేడు, జూన్‌ 21: కరోనాతో భర్త మృతి చెందగా.. ఆయన మరణ వార్తను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో చోటు చేసుకుంది. సత్యవేడుకు చెందిన నాగేశ్వరరావు (71) కరోనా సోకడంతో పదిరోజులుగా సత్యవేడు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన మృతి చెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య మునీంద్ర (56) కూడా బీపీ ఎక్కువై సోమవారం మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

Updated Date - 2021-06-22T08:44:29+05:30 IST