అలిపిరి టోల్‌గేట్ ఛార్జీల్లో భారీ మార్పులు
ABN , First Publish Date - 2021-02-26T20:10:30+05:30 IST
అలిపిరి దగ్గర ఉన్న టోల్‌గేట్ ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుపతి: అలిపిరి దగ్గర ఉన్న టోల్‌గేట్ ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్‌గేట్ ఛార్జీల్లో సవరణలు చేసింది. అలిపిరి ఘాట్‌రోడ్డులో వెళ్లే బైక్‌ల టోల్‌ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కార్లు, జీపులు, టాటాఏస్, టాక్సీలకు రూ.50 వసూలు చేస్తారు. అలిపిరిలో మినీ బస్సులు, మినీ లారీలకు వసూలు చేసే ఫీజును రూ.100కి పెంచింది. భారీ ట్రక్కుల టోల్ ఫీజును రూ.200కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.