బీజేపీ నేతలెలా డిసైడ్‌ చేస్తారు?: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2021-12-30T08:20:26+05:30 IST

సీఎం జగన్‌ విషయంలో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

బీజేపీ నేతలెలా డిసైడ్‌ చేస్తారు?: మంత్రి బాలినేని

‘‘సీఎం జగన్‌ విషయంలో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కోర్టుల్లో ఉన్న విషయాలను బీజేపీ నేతలు ఏలా డిసైడ్‌ చేస్తారు? జగన్‌ను పడగొట్టేందుకు అన్ని పార్టీల నాయకులు కలిశారు’’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అజెండా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క టన్ను ఎర్రచందనం కూడా స్మగ్లింగ్‌ జరగలేదన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నట్లు దుష్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-12-30T08:20:26+05:30 IST