ఆక్సిజన్‌ అందక ఆగిన ఊపిరి!

ABN , First Publish Date - 2021-05-18T08:49:58+05:30 IST

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరో కరోనా రోగి ఊపిరి తీసింది. బాధితురాలికి అందుతున్న ఆక్సిజన్‌ అయిపోయిందని, సిలిండర్‌ మార్చాలని అధికారుల, డాక్టర్లను వేడుకున్నా స్పందించకపోవడంతో ఈలోగా ఆమె గిలగిలా

ఆక్సిజన్‌ అందక ఆగిన ఊపిరి!

సకాలంలో స్పందించని ఆస్పత్రి సిబ్బంది


కావలి, మే 17: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరో కరోనా రోగి ఊపిరి తీసింది. బాధితురాలికి అందుతున్న ఆక్సిజన్‌ అయిపోయిందని, సిలిండర్‌ మార్చాలని అధికారుల, డాక్టర్లను వేడుకున్నా స్పందించకపోవడంతో ఈలోగా ఆమె గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. కావలిలోని వెంగళరావు నగర్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ కొవిడ్‌బారిన పడి ఏరియా వైద్యశాలలో చేరింది. మధ్యాహ్నం ఆమెకు పెట్టిన సిలిండర్‌లో ఆక్సిజన్‌ అయిపోయింది. దీంతో ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కంగారుపడిన బంధువులు అక్కడ ఆక్సిజన్‌ సిలిండర్‌ మార్చే వారు ఎవరూ లేకపోవడంతో వైద్యులతోపాటు అధికారులకు ఫోన్‌ చేశారు. కానీ వారు సకాలంలో స్పందించకపోవడంతో బాధితురాలా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. కళ్లముందే ఆమె ప్రాణాలు విడవడంతో అక్కడున్న రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.

Updated Date - 2021-05-18T08:49:58+05:30 IST