మీ కార్యకర్తలతో మీరే దాడి చేసుకున్నారేమో...

ABN , First Publish Date - 2021-10-20T08:42:53+05:30 IST

‘టీడీపీ కార్యాలయంపై మీ కార్యకర్తలను మీరే ప్రోత్సహించుకొని మీరే దాడి చేసుకున్నారేమోనన్న అనుమానం మాకు కలుగుతోంది’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని చంద్రబాబే పర్యవేక్షించారన్న

మీ కార్యకర్తలతో మీరే దాడి చేసుకున్నారేమో...

  • దాడిని చంద్రబాబే పర్యవేక్షించినట్టు అనుమానం
  • అన్‌నోన్‌ నంబరు నుంచి డీజీపీకి ఫోన్‌ చేశారు: సుచరిత
  • పట్టాభి వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసన: వైసీపీ


గుంటూరు, అక్టోబరు 19: ‘‘టీడీపీ కార్యాలయంపై మీ కార్యకర్తలను మీరే ప్రోత్సహించుకొని మీరే దాడి చేసుకున్నారేమోనన్న అనుమానం మాకు కలుగుతోంది’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని చంద్రబాబే పర్యవేక్షించారన్న అనుమానం కలుగుతోంది. గుజరాత్‌లో డ్రగ్‌ ్స దొరికితే ఏపీని డ్రగ్స్‌ మాఫియాగా మార్చారని అనటం ఎంతవరకు సమంజసం? డ్రగ్స్‌తో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్రం చెప్పినప్పటికీ అడ్డగోలుగా ఆరోపణలు చేయటం టీడీపీ కుసంస్కారానికి నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయిని కూడా కట్టడి చేశాం. గంజాయి కట్టడికి తీసుకున్న చర్యలు, నమోదు చేసిన కేసులను బుధవారం వివరిస్తాం’’ అని చెప్పారు. సీఎంను దద్దమ్మ, చేతగాని వాడు అంటూ నీచమైన భాషతో మాట్లాడటం సరికాదన్నారు. ‘‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపాలి. అంతేగాని తప్పుడు ఆరోపణలు, నీచమైన భాషను ఉపయోగిస్తే సహించేదిలేదు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. పట్టాభి భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఏదో గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్‌ చేశామని, నా ఫోన్‌కు డీజీపీ స్పందించలేదని చంద్రబాబు విమర్శించడం సరికాదన్నారు. ఆ సమయంలో డీజీపీ ఎల్లుండి జరిగే అమరవీరుల కార్యక్రమానికి సంబంధించిన పరేడ్‌లో ఉన్నారు’’ అని వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండించిన పవన్‌ కల్యాణ్‌... సీఎంను టీడీపీ నేతలు తిట్టడాన్ని ఎందుకు ఖండించలేదని సుచరిత ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-20T08:42:53+05:30 IST