కన్యాకుమారి టు ఢిల్లీ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-19T09:24:52+05:30 IST

కన్యాకుమారి టు ఢిల్లీ పాదయాత్ర

కన్యాకుమారి టు ఢిల్లీ పాదయాత్ర

‘రక్తదానం’పై గుంటూరు యువకుడి సాహసం

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం

న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గుంటూరుకు చెందిన గుండు శివ అనే యువకుడు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశారు. శనివారం ఆయన పాదయాత్రను ఢిల్లీలో ముగించారు. తొలుత గుంటూరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్ర చేపట్టిన శివ.. అక్కడి నుంచి ఏప్రిల్‌ ఒకటిన పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు 10,800 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన వాళ్లంతా రక్తదానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. పాదయాత్రలో భాగంగా అనేక పాఠశాలలు, కళాశాలల్లో రక్తదాన అవగాహన కార్యక్రమకాలు నిర్వహించానని వివరించారు. కాగా, రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నందుకుగాను శివకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం లభించింది. 

Updated Date - 2021-12-19T09:24:52+05:30 IST