హిజ్రా పెద్ద మనసు!

ABN , First Publish Date - 2021-12-31T08:27:04+05:30 IST

హిజ్రా పెద్ద మనసు!

హిజ్రా పెద్ద మనసు!

అనాథ కుటుంబానికి 20 వేలు సాయం


విజయవాడ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): హిజ్రా పెద్ద మనసు చాటుకుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, ప్రధానకూడళ్ల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును ఓ అనాథ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఇచ్చింది. విజయవాడలో చోటుచేసుకున్న ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయవాడ బెంజ్‌సర్కిల్‌ వద్ద నిత్యం వేలాది వాహనాలు ఆగుతాయి. ఆ సమయంలో యాచకులు, హిజ్రాలు వాహనదారుల వద్ద భిక్షాటన చేస్తుంటారు. కల్యాణి అనే హిజ్రా కూడా ఇక్కడ యాచిస్తుంటుంది. ఈ క్రమంలో బెంజ్‌సర్కిల్‌ వద్దే ఓ బాలుడితో కలిసి ఉంటున్న ఇద్దరు వృద్ధులను గమనించింది. ఆ వృద్ధుడికి ఒక కాలు లేకపోవడంతో పనిచేయలేని పరిస్థితి. దీంతో పూట గడవడం కష్టమైంది. ఈ నేపథ్యంలో కల్యాణి తోటి హిజ్రాలతో కలిసి సంపాదించిన రూ.20 వేలను వారికి అందించింది. ఈ సొమ్ముతో చిన్న వ్యాపారం చేసుకోవాలని సూచించింది.

Updated Date - 2021-12-31T08:27:04+05:30 IST