దేశంలోనే అధిక బాదుడు!

ABN , First Publish Date - 2021-11-09T07:50:50+05:30 IST

పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్రాలు వేస్తున్న పన్నుల్లో అత్యధిక బాదు డు సీఎం జగన్‌రెడ్డిదేనని టీడీపీ ఆరోపించింది.

దేశంలోనే అధిక బాదుడు!

రెండున్నరేళ్లలో పెట్రోలు, డీజిల్‌పై రూ.29 వేల కోట్ల వసూలు

కేంద్రం వేసిన పన్నులు కాకుండానే జగన్‌రెడ్డి ఇంత భారం మోపారు

ఇవి మా సొంత లెక్కలు కాదు

పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పినవే

తగ్గింపుపై సీఎంకు మనసు రావడం లేదు

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజం

నేడు రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద ధర్నాలు


అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్రాలు వేస్తున్న పన్నుల్లో అత్యధిక బాదు డు సీఎం జగన్‌రెడ్డిదేనని టీడీపీ ఆరోపించింది. ‘సరాసరిన ఏడాదికి రూ.11 వేల కోట్లు దీనిపై పన్నుల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తోంది. రెండున్నరేళ్ళలో రూ. 29 వేలకోట్లు ప్రజల నుంచి పిండింది. కేంద్రం వేస్తున్న పన్నులుగాక రాష్ట్రం వేసిన పన్నుల భారమిది. ఇంత స్థాయిలో పన్నులు వేసి ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడారు. తాము చెబుతున్నవి సొంత లెక్కలు కాదని, కేంద్రం అధికారికంగా పార్లమెంటులో చెప్పినవేనన్నారు. ‘ఏ రాష్ట్రం ఎంతెంత పన్నులు వేసిందీ.. ఈ ఏడాది జూలై 26న పార్లమెంటులో కేంద్ర ఇంధన మంత్రి వివరించారు. దాని ప్రకా రం మన ప్రభుత్వం పెట్రోలు మీద రూ.7.59, డీజిల్‌ మీద రూ.5.48 అదనంగా పన్నుల ద్వారా ఆదాయం పొందింది. దేశంలో మరే రాష్ట్రం పెట్రోలు, డీజిల్‌ ధర లు పెంచి ఇంత అదనపు ఆదాయం పొందలేదు. అదనపు బాదుడు ద్వారా 2019-20లో 10 వేల కోట్లు, 20-21లో 11 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ సుమారు రూ.7 వేల కోట్లు వచ్చింది. రోడ్డు సెస్సు ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపితే ఈ రెండున్నరేళ్లలో రూ.29 వేల కోట్లు వసూలు చేశా రు’ అని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగా ల్లో ఏడాదికి 84 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురు వినియోగం ఉంటే ఆ రాష్ట్రాని కి వచ్చిన పన్ను ఆదాయం రూ.7 వేల కోట్లేనని, మన రాష్ట్రంలో వినియోగం 72 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నా ఇక్కడి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.11 వేల కోట్లు ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు పన్నుల భారం తగ్గించి తమ ప్రజలకు ఉపశమనం కలిగించాయని.. ఇక్కడ తగ్గించడానికి మన ముఖ్యమంత్రికి మనసు రావడం లేదని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల ముందు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 


దాడులకు భయపడను..

తాను దాడులకు భయపడే వ్యక్తిని కానని, నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూనే ఉంటానని పట్టాభి చెప్పారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి తర్వాత ఆయన సోమవారం మొదటిసారి మీడియా ముందుకొచ్చా రు. ‘నిజాలను ప్రజలకు చెబుతున్నాననే నాపై దాడి చేశారు. నాపైనే కాదు.. రాష్ట్రంలోని పసుపు సైనికులందరిపైనా ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయి నా వారంతా ఎత్తిన జెండా దించకుండా మొక్కవోని పట్టుదలతో పోరాడుతున్నారు. నేను కూడా వారి స్ఫూర్తితో ఇక ముందూ పోరాడతాను. నాలాంటి వారికి చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు వంటి అనేక మంది నేతలు అండగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. వారందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

Updated Date - 2021-11-09T07:50:50+05:30 IST