పరిహారం లేకుండా గిరిజన గ్రామాల తరలింపు పిటిషన్‌పై హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-03-24T18:24:57+05:30 IST
విజయవాడ: పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలను తరలిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

విజయవాడ: పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలను తరలిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. కొన్ని ఫొటోలతో కూడిన అడిషనల్ మెటీరియల్‌ను పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఖాళీ చేయించలేదంటూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ కౌంటర్.. కోర్టు రికార్డుల్లోకి రాలేదని, పిటిషనర్ వేసిన ఫొటో మెటీరియల్ కూడా అందుబాటులోకి రాలేదని హైకోర్టు వెల్లడించింది. మరోసారి ఫైల్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.