ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-05-08T08:43:36+05:30 IST

ఏలూరు నగరపాలిక సంస్థ ఎన్నికల విషయంలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది

ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరపాలిక సంస్థ ఎన్నికల విషయంలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నేపథ్యలో ఓట్ల లెక్కింపు సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. 

Updated Date - 2021-05-08T08:43:36+05:30 IST