నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌ వేసింది: బాలశౌరి

ABN , First Publish Date - 2021-02-05T21:42:36+05:30 IST

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రైవేట్ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌ వేసిందని వైసీపీ ఎంపీ బాలశౌరి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌ వేసింది: బాలశౌరి

ఢిల్లీ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రైవేట్ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌ వేసిందని  వైసీపీ ఎంపీ బాలశౌరి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఈసీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హులా? అని బాలశౌరి ప్రశ్నించారు. 


ఈ-వాచ్‌ యాప్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్‌ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్‌ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్‌ చెప్పింది. ఈలోపు యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు ధర్మాసనం సూచించింది. 

Updated Date - 2021-02-05T21:42:36+05:30 IST