‘రాజధాని’ కేసుల్లో మళ్లీ కదలిక!?

ABN , First Publish Date - 2021-03-21T09:10:04+05:30 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జ్యోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ యన్‌.జయసూర్యతో కూడిన ఽత్రిసభ్య ధర్మాసనం ఈ నెల 26న రాజధాని

‘రాజధాని’ కేసుల్లో మళ్లీ కదలిక!?

ఈ నెల 26న త్రిసభ్య ధర్మాసనం

రోస్టర్‌ విడుదల చేసిన హైకోర్టు

నాటి సీజే మహేశ్వరి నేతృత్వంలో

కేసులు విచారించిన త్రిసభ్య బెంచ్‌

ఆయన బదిలీతో నిలిచిన వ్యాజ్యాలు

తిరిగి వాటి విచారణ కోసమేనా!

హైకోర్టు న్యాయవర్గాల్లో చర్చ


అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జ్యోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ యన్‌.జయసూర్యతో కూడిన ఽత్రిసభ్య ధర్మాసనం ఈ నెల 26న రాజధాని వ్యాజ్యాల్లో విచారణ జరపనుందని న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. జస్టిస్‌ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో ఈ నెల 26న త్రిసభ్య ధర్మాసనం విచారణకు కూర్చుంటున్నట్లు పేర్కొన్నారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ కోరుతూ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు లేఖ రాసినట్లు సమాచారం. సీజే రోస్టర్‌లో మార్పులు చేయడంతో న్యాయమూర్తుల సబ్జెక్టులలో మార్పులు జరగనున్నాయి.

Updated Date - 2021-03-21T09:10:04+05:30 IST