స్టేట్‌ సెక్రటరీ అంట...సిగ్గుండాలి

ABN , First Publish Date - 2021-05-08T09:09:00+05:30 IST

కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ సినీ హీరో సిద్ధార్థ్‌ చేసిన విమర్శ బీజేపీతో వివాదానికి దారి తీసింది

స్టేట్‌ సెక్రటరీ అంట...సిగ్గుండాలి

బీజేపీ విష్ణువర్ధన్‌రెడ్డిపై హీరో సిద్ధార్థ ఫైర్‌


అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ సినీ హీరో సిద్ధార్థ్‌ చేసిన విమర్శ బీజేపీతో వివాదానికి దారి తీసింది. ‘‘సిద్ధార్థ్‌... నీ సినిమాలకు దావూద్‌ నిధులు ఇస్తున్నారా? సమాధానం చెప్పు’ అంటూ బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. సిద్ధార్థ్‌ స్పందిస్తూ... ‘‘నో రా.. దావూద్‌ నా టీడీఎ్‌సచెల్లించేందుకు సిద్ధంగా లేరు. నేను పర్‌ఫెక్ట్‌ సిటిజన్‌ని, టాక్సు పేయరును కదరా విష్ణూ. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్‌ సెక్రటరీ అంట... సిగ్గుండాలి’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-05-08T09:09:00+05:30 IST