బీసీలకు సాయంలో వివక్ష దారుణం: కేసన
ABN , First Publish Date - 2021-08-25T09:14:41+05:30 IST
బాధిత బీసీ కుటుంబాలకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం దారుణమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

తెనాలి రూరల్, ఆగస్టు 24: బాధిత బీసీ కుటుంబాలకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం దారుణమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. బీసీలపై ప్రభుత్వ చిన్న చూపుచూస్తోందని ఆరోపించారు. హత్యకు గురైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రమ్య కుటుంబానికి 24గంటల్లో రూ.పదిలక్షల చెక్కును, మూడోరోజు రూ.నాలుగున్నర లక్షలు బ్యాంక్ ఖాతాలో జమచేసిన ముఖ్యమంత్రి.. రమ్య తరహాలోనే హత్యకు గురైన బీసీ( నాయిబ్రాహ్మణ) సామాజిక వర్గానికి చెందిన కడప జిల్లా బద్వేల్ మండలం చింతలచెరువు గొడుగునూరు గ్రామానికి చెందిన శిరీష కుటుంబానికి ఎలాంటి సాయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. శిరీష కుటుంబానికి కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవడం బీసీలపై ముఖ్యమంత్రికి ఉన్న చిన్నచూపు అర్ధమవుతోందన్నారు. శిరీష కుటుంబానికి కూడా అందించాలని శంకరరావు డిమాండ్ చేశారు.