నేడు, రేపు భారీ వర్షాలు!

ABN , First Publish Date - 2021-11-02T08:01:36+05:30 IST

దక్షిణ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్‌, ఉత్తర శ్రీలంక తీరప్రాంతంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 48 గంటల్లో

నేడు, రేపు భారీ వర్షాలు!

అమరావతి/విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్‌, ఉత్తర శ్రీలంక తీరప్రాంతంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బుధవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-11-02T08:01:36+05:30 IST