ఈ రోజు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-05-24T22:07:15+05:30 IST

యాస్ తుపాన్ ప్రభావంతో ఈ రోజు , రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

ఈ రోజు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

అమరావతి: యాస్ తుపాన్ ప్రభావంతో ఈరోజు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. సముద్రంలో అలలు 2.90-4.5 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు. 

Updated Date - 2021-05-24T22:07:15+05:30 IST