సోమశిల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
ABN , First Publish Date - 2021-12-12T01:34:04+05:30 IST
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సోమశిల డ్యామ్‌లోకి

నెల్లూరు: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సోమశిల డ్యామ్‌లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. కాగా ప్రస్తుత నీటి నిల్వ 77.98 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది.