జగన్‌కి లక్ష ఉత్తరాలు రాశాం.. అయినా స్పందించలేదు: హరిరామ జోగయ్య
ABN , First Publish Date - 2021-11-26T16:36:46+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. రైతుల కోసం రైతు నవరత్నాలు పేరుతో 9 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.

అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. రైతుల కోసం రైతు నవరత్నాలు పేరుతో 9 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో నిత్యవసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని.. జీవించడమే కష్టంగా మారిందన్నారు. తెల్లరేషన్ కార్డు దారులకు నెలకు 3వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి లక్ష ఉత్తరాలు రాశామని... అయినా ముఖ్యమంత్రి జగన్‌కి స్పందించలేదని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. దీనికి నిరసనగా అవసరమైతే రిలే నిరాహర దీక్షలు చేపడుతామన్నారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు బుణాలు మాఫీ చేయాలన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు దూరం పెట్టి ప్రజలు శాంతియుతంగా, ధైర్యంగా బతికేలా పాలన అందిచాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.