ఎంసీఏ, ఎంబీఏ సీట్లు సగమే భర్తీ

ABN , First Publish Date - 2021-12-30T08:50:48+05:30 IST

ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలోని కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సగం సీట్లే భర్తీ అయ్యాయి.

ఎంసీఏ, ఎంబీఏ సీట్లు సగమే భర్తీ

  • మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి
  • 26 ఎంబీఏ కళాశాలల్లో ప్రవేశాలు నిల్‌ 

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజోతి): ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలోని కళాశాలల్లో  మొదటి విడత కౌన్సెలింగ్‌లో సగం సీట్లే భర్తీ అయ్యాయి. ఇంకా రెండో విడత కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉంది. ఏపీ ఐసెట్‌ -2021మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో భర్తీ అయిన సీట్ల వివరాలను ఐసెట్‌ కన్వినర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 36,263 సీట్లు అందుబాటులో ఉండగా 15071 మంది అభ్యర్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏకి కలిపి  13930 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారని, 12612 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 1318 మందికి సీట్లు కేటాయించలేదన్నారు. 27 ఎంబీఏ కళాశాలల్లో, 56 ఎంసీఏ కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ కాగా, 26 ఎంబీఏ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదన్నారు.


7న పాఠశాల భద్రతా దినోత్సవం 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జనవరి 7న పాఠశాల భద్రతా దినోత్సవాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురే్‌షకుమార్‌ ఆదేశించారు. సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ’బాలల భద్రత- పాఠశాల భద్రత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది.  ఆయన మాట్లాడుతూ ఏడో తేదీన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ ఉంటుందని తెలిపారు. పాఠశాల భద్రతా దినోత్సవాన్ని ఈ ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం అమలు జరిపి, విద్యార్థుల, పాఠశాల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

Updated Date - 2021-12-30T08:50:48+05:30 IST