బ్యాలెట్ బాక్స్‌లో ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్‌’ స్లిప్పులు

ABN , First Publish Date - 2021-03-14T16:25:03+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యమం...

బ్యాలెట్ బాక్స్‌లో ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్‌’ స్లిప్పులు

ఇంటర్నెట్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా... బ్యాలెట్ పేపర్‌లతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని రాసి ఉన్న స్లిప్పులు కనిపించాయి. పార్టీలకు అతీతంగా ... స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉద్యమం నడుస్తోన్న విషయాన్ని ఈ విధంగా ఓటర్లు చాటి చెప్పారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాన్ని బ్యాలెట్ బాక్సులలోనూ వినిపిస్తున్నారని... ఆ విధంగా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అదే సమయంలో జీవీఎంసీ ఎన్నికలు రావడంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. విశాఖ వాసుల తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2021-03-14T16:25:03+05:30 IST